రష్యాకు మంత్రి లోకేశ్‌.. ఐదు రోజుల పర్యటన వివరాలు ఇవే..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్రానికి పెట్టుబడులను లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్‌ రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూన్‌ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సాగనున్న ఈ విదేశీ పర్యటనలో ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటారు...

రష్యాకు మంత్రి లోకేశ్‌.. ఐదు రోజుల పర్యటన వివరాలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడులను లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh) రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూన్‌ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సాగనున్న ఈ విదేశీ పర్యటన(Foreign Tour)లో ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ ఫోరం (SPIEF-26)’ సదస్సులో పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వాహకుల నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి లోకేశ్‌ ఈ వేదికపై ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం

ఈ ఉన్నత స్థాయి సదస్సులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు, గ్రీన్‌ ఎనర్జీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, విద్య మరియు మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాల్లో ఏపీలో దాగి ఉన్న అపారమైన అవకాశాలను ఈ వేదికపై ఆయన ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.

సరికొత్త పుంతలు

రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించడంతో పాటు సరికొత్త అవకాశాలను సృష్టించడమే ధ్యేయంగా ఈ రష్యా పర్యటన సాగనుంది. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించడం, తద్వారా భారీగా కొత్త పెట్టుబడులను సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశాభావాన్ని కూటమి ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.

Next Story