దేశంలోనే తొలిసారిగా... ప్రభుత్వ హైస్కూలులో స్మార్ట్ కిచెన్

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా సికె దిన్నె ఎంపీపీ హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు...

దేశంలోనే తొలిసారిగా... ప్రభుత్వ హైస్కూలులో స్మార్ట్ కిచెన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సికె దిన్నె ఎంపీపీ హైస్కూలు(Mpp High School)లో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌(Advanced Smart Kitchen)ను మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh) ప్రారంభించారు. 1787 మంది విద్యార్థులకు భోజనం తయారీ చేసి పంపిణీ చేశారు. కమలాపురం నియోజక వర్గంలో 2, జమ్మలమడుగు 2, కడపకు చెందిన ఒక స్మార్ట్ కిచెన్‌ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి శుచికరమైన భోజనం తయారీ, ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లోకేశ్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభిస్తామన్నారు. కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచితో కూడిన భోజనం అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

Next Story