- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీలో అదరగొట్టిన నారా లోకేష్.. కేంద్రమంత్రి ముందే రిటర్న్ గిఫ్ట్ అంటూ..
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ కొద్దిసేపు హిందీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘ఆపరేషన్ సింధూర్‌కు ఏడాది పూర్తి అయ్యింది. శత్రువుకు భారత రక్షణ దళాల శక్తి ఏమిటో ప్రధాని చూపించారు. ప్రతీ భారతీయుడు గర్వపడే ప్రధాని దేశానికి ఉన్నారు. దేశానికి ఐరన్ మ్యాన్‌గా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుంది. కూటమికి మద్దతు ఇచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే ఈ ప్రాజెక్టు తెచ్చాం. కరవు నేలపై రక్షణ ప్రాజెక్టులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కరవు నేలపై కియా ప్రాజెక్టు తీసుకువచ్చిన నేత సీబీఎన్. గతంలో శ్రీసత్యసాయి బాబా పుట్టపర్తిలో ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే అందరూ అవసరమా అని అడిగారు. బాబా స్పూర్తితో పుట్టపర్తికి కూటమి ప్రభుత్వం డిఫెన్సు ప్రాజెక్టు తెచ్చింది. డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ ఏపీలో ఉంది. ఏపీలో నమో అంటే నాయుడు జీ, మోడీజీ జోడీ. మోడీజీ, బాబుజీ, రాజ్ నాథ్ సింగ్ జీ 75 ఏళ్ల కుర్రవాళ్లు. వారి స్పీడ్ ఇప్పటికీ ఎవరూ అందుకోలేరు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి లక్షల కోట్ల ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి. త్వరలో కర్నూలులోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. నాయుడుజీ, మోడీజీ జోడీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది.
ఏపీని చూసి అసూయపడే పరిస్థితి..
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశాం. పొరుగు రాష్ట్ర ప్రజలు ఏపీని చూసి అసూయపడే పరిస్థితి తీసుకువచ్చాం. రాయలసీమతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్సు వచ్చింది. పుట్టపర్తిలో ఏడీఏ AMCA ప్రాజెక్టును తీసుకువచ్చాం. పుట్టపర్తిలో 5వ తరం ఆధునిక యుద్ధ విమానాల ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు వచ్చింది. ఇతర డిఫెన్సు ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చాయి. AMCA ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా నెంబర్-1గా నిలుస్తుంది. AMCA కథ 2025 డిసెంబరులో ఢిల్లీలో మొదలైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి ఈ ప్రాజెక్టు ఇవ్వాలని కోరాను. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేసింది. ఇది కేవలం డిఫెన్సు ప్రాజెక్టు మాత్రమే కాదు రాయలసీమకు కొత్త దిశను కల్పించే అత్యుత్తమ ప్రాజెక్టు ఇది. ఇంత మంచి పెద్ద ప్రాజెక్టును ఏపీకి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి రాజ్ నాథ్ సింగ్‌కు ధన్యవాదాలు. భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సహకరాన్ని అందిస్తుంది. వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్- మనది ఫైటర్ జెట్ బ్యాక్ గ్రౌండ్. వాళ్లది క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ మనది కియా బ్యాక్ గ్రౌండ్’ అని నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.






