పార్టీ నేతలపై లోకేష్ సీరియ‌స్‌.. గ్రీవెన్స్ నిర్వహించాల్సిందేనని ఆదేశం

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. గత 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడంపై ఆయన మండిపడ్డారు...

పార్టీ నేతలపై లోకేష్ సీరియ‌స్‌.. గ్రీవెన్స్ నిర్వహించాల్సిందేనని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నేతలపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సీరియస్ అయ్యారు. గత 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ నేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన మైదకూరు, కడప, ప్రొద్దుటూరు, క‌మ‌లాపురం ఎమ్మెల్యేలు, పులివెందుల, ధర్మవరం ఇన్‌చార్జ్‌ల‌పై లోకేష్ సీరియ‌స్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన ప‌రిస్థితులుంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పార్టీ ఇంచార్జులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి లోకేశ్ దృష్టి పెట్టడంతో ఇక నుంచి యాక్టివ్‌గా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు లోకేష్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్‌ తప్పకుండా పాటిస్తామని ఆయనకు చెప్పినట్లు సమాచారం.

Next Story