- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం.. ఎట్టకేలకు స్పందించిన లోకేశ్
డిప్యూటీ సీఎం అంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ ఎట్టకేలకు స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొందరు వ్యక్తులు పని గట్టుకుని మరీ పోస్టులు వైరల్ చేశారు. దీంతో కూటమి నాయకుల్లో గందరగోళం నెలకొంది. టీడీపీ(Tdp), జనసేన(Janasena) కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. దీంతో కూటమి పార్టీల అధిష్టానం అప్రమత్తమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. దీంతో ఈ దుష్ప్రచారాలకు తెర పడినట్లైంది.
అయితే డిప్యూటీ సీఎం ప్రచారంపై నిన్నటి వరకూ మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎట్టకేలకు ఆయన తాజాగా రియాక్ట్ అయ్యారు. తాను కార్యకర్తగానే పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తనకు ఏ బాధ్యత ఇస్తే అదే చేస్తానని తెలిపారు. కుటుంబంలో మూడు పదవులకు పైగా ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని తెలిపారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేదనేది తన అభిప్రాయమని నారా లోకేష్ వెల్లడించారు.






