- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో ఉంటే పనులు కావు: కార్యకర్తలకు లోకేశ్ కీలక సూచనలు
కూటమి కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ కొన్ని కీలక సూచనలు చేశారు

దిశ, వెబ్ డెస్క్: కూటమి కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) కొన్ని కీలక సూచనలు చేశారు. శనివారం సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అయితే పట్టణాలు, గ్రామాల్లో అర్జీల స్వీకరణ, పరిష్కారం, నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దుష్ప్రచారాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు.
‘‘దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామస్థాయిలో పని జరగపోతే మండల స్థాయి నాయకుల ద్వారా చేయించుకోండి. అప్పటికీ జరగకపోతే MLA వద్దకు వెళ్లండి. అయినా పరిష్కారం కాకపోతే జిల్లా ఇంచార్జి మంత్రిని కలవండి. అక్కడా పని జరగకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి అర్జీ ఇవ్వండి. ఇంట్లో ఉంటే ఏ పని జరగదు, దయ చేసి మీ సొంత పనులు కూడా అడగండి. ఎక్కడ నిరుత్సాహ పడవద్దు. అమ్మ, నాన్న మీద అలిగినట్టు పార్టీపై అలగొద్దు. అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు. దయచేసి మూడవ వ్యక్తి చెప్పింది నమ్మవద్దు. మీరు లైవ్‌లో విన్నవి నమ్మండి. ‘మన MLA వైసీపీ(Ycp) వాళ్ళకి చేస్తున్నాడు అంటా?, లోకేష్ టైమ్ ఇవ్వడం లేదంటా?, చంద్రబాబు అసలు కలవడం లేదంటా?’ అని ఇలాంటి పుకార్లు నమ్మవద్దు. మేము మనషులం కదా! , కొన్ని తప్పులు చేయవచ్చు. దయచేసి మీరు చెప్పండి.’’అంటూ నారా లోకేశ్ సూచించారు.






