నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 21.3 ఎకరాల్లో కాగ్నిజెంట్ క్యాంపస్‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-20 12:51:42  IST  )

ఏపీలో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ తెలిపారు...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 21.3 ఎకరాల్లో కాగ్నిజెంట్ క్యాంపస్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. విశాఖ(Visakha)లో ‘యోగా డే’(Yoga Day) ఏర్పాట్లను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖలో రూ.1,583 కోట్ల కాగ్నిజెంట్(Cogizant) పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. మొత్తం 21.3 ఎకరాల్లో కాగ్నిజెంట్ క్యాంపస్‌ ఏర్పాటు కాబోతోందని స్పష్టం చేశారు. ఈ కంపెనీతో 8 వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. విశాఖలో కార్యకలాపాలు సాగించనున్న కాగ్నిజెంట్‌కు తాము ఘనంగా స్వాగతం పలుకుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

మరోవైపు విశాఖలో నిర్వహించనున్న యోగా డే కార్యక్రమానికి సర్వంసిద్ధమైంది. ప్రధాని మోడీ ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడంతో దేశమొత్తం విశాఖ నగరంవైపు చూస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ యోగా డేను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 5 లక్షల మందితో యోగా డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదికతో పాటు ఏయూలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యోగా డేతో గిన్నీస్ బుక్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందేమో చూడాలి మరి.

Next Story