- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాట నిలబెట్టుకున్న మంత్రి.. పేదింట్లో పండుగ వెలుగులు
గతేడాది రంజాన్ సమయంలో ఓ ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను.. సరిగ్గా ఏడాదికి నెరవేర్చారు మంత్రి నారా లోకేష్.

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ పవిత్ర మాసంలో మంగళగిరికి చెందిన ఒక పేద ముస్లిం కుటుంబంలో మంత్రి నారా లోకేష్ పండుగ కాంతులు నింపారు. గత ఏడాది రంజాన్ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న షహెన్షా అనే వ్యక్తి ఇంటికి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఆ సమయంలో వారు నివాసం ఉంటున్న ఇంటి దుస్థితిని గమనించిన లోకేష్, చలించిపోయి వారికి సొంతంగా నూతన గృహాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఏడాది తిరగకముందే సకల సౌకర్యాలతో కూడిన రెండంతస్తుల భవనాన్ని నిర్మించి ఆ కుటుంబానికి అందించారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతి పెద్ద బహుమతిని అందించిన మంత్రి లోకేష్ పట్ల షహెన్షా కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇది నిజమైన రంజాన్ తోఫా అని, తమ కష్టాలను గుర్తించి ఆదుకున్న లోకేష్‌కు వారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.






