భారత్‌కు ఇది గొప్ప విజయం : మంత్రి నారా లోకేష్

by Naga Rani Yarlagadda |

భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

భారత్‌కు ఇది గొప్ప విజయం : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భారత ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 25 శాతం టారిఫ్ లను 18 శాతానికి తగ్గించడం.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధించిన గొప్పవిజయంగా పేర్కొన్నారు. మోదీ దూరదృష్టితో ఆలోచించి సాధించిన కీలక ముందడుగు అని అభివర్ణించారు. టారిఫ్ లను తగ్గించడంతో భారత్ ఎగుమతులు, తయారీ రంగానికి భారీ ఊతం లభిస్తుందని, ప్రధాన ఎగుమతులైన సముద్ర ఆహారం, ఎంఎస్ఎంఈలు మరింత లాభపడుతాయని పేర్కొన్నారు. భారత్ - అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనుందని మంత్రి తెలిపారు. ఈ కీలక ఒప్పందంతో గొప్ప విజయాన్ని సాధించిన చర్చా బృందాలకు, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు లోకేష్ అభినందనలు తెలిపారు.

Next Story