- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని భరోసా ఎంతో ఊరటనిచ్చింది: మంత్రి నారా లోకేశ్ హర్షం
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని పార్లమెంటులో రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రధాని మోడీ ఇచ్చిన హామీపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని పార్లమెంటు(Parliament)లో రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రధాని మోడీ(Pm Modi) ఇచ్చిన హామీపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని ఇచ్చిన ఈ భరోసా ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే (NDA) ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉందనడానికి ఈ ప్రకటన నిదర్శనమని లోకేశ్ కొనియాడారు.
సమానత్వమే కూటమి ఉద్దేశం
ఈ సందర్భంగా లోకేశ్ ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూడడమే ఎన్డీయే లక్ష్యమని స్పష్టం చేశారు. "ఇది ఎన్డీయే గ్యారెంటీ" అని ఆయన తెలిపారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే తమ ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్న రాష్ట్రాలకు ఈ హామీ గొప్ప భరోసానిస్తుందని, దేశాభివృద్ధిలో అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం సమంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని లోకేశ్ పేర్కొన్నారు.






