- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంతోషిస్తున్నా.. గర్విస్తున్నా: విశాఖ వరల్డ్ కప్ మ్యాచ్‌లపై లోకేశ్ హర్షం
విశాఖలో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించడంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు(ICC Womens Cricket World Cup matches) నిర్వహించడంపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కావడం సంతోషంగా ఉందని, గర్విస్తున్నానని ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి మహిళ క్రికెట్లను విశాఖకు వస్తున్నారని, వారందరిని స్వాగతిస్తున్నామన్నారు. ఇది ఆంధ్ర క్రికెట్ ప్రయాణంలో ఒక మైలు రాయి అని చెప్పారు. కొత్తతరం అమ్మాయిలు ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు ఇది అవకాశమని, కేవలం క్రీడా కార్యక్రమం కాదని చెప్పారు. ప్రపంచ క్రికెట్‌కు ఏపీ వేదిక కావడం... క్రీడల పట్ల ఎక్కువ మక్కువ ఉన్న వ్యక్తిగా సంతోషిస్తున్నానని నారా లోకేశ్ చెప్పారు. ఈ మేరకు నారా లోకేశ్ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు.
Next Story






