బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటన ఎంతో బాధాకరమైందన్నారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు.

Next Story