తొక్కిసలాట ఘటనపై మంత్రి లోకేష్ విచారం.. కాసేపట్లో కాశీబుగ్గకు పయనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-01 09:09:11  IST  )

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తొక్కిసలాట ఘటనపై మంత్రి లోకేష్ విచారం.. కాసేపట్లో కాశీబుగ్గకు పయనం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏకాదశి రోజున ఇంతటి తీవ్ర విషాద ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కాసేపట్లో ఆయన కాశీబుగ్గకు వెళ్లి.. అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. కాగా.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పర్యటనలో ఉన్న జిల్లా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయల్దేరారు.

కాగా.. తొక్కిసలాటలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఆలయం మొదటి అంతస్తులో ఉండటం, 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపడటంతో ప్రమాదం జరిగినట్లుగా మంత్రి తెలిపారు. మృతుల్లో మహిళా భక్తులు ఎక్కువగా ఉండటం బాధాకరమన్నారు.

Next Story