- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: పట్టాభిరాం మృతి పట్ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్ డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (BV Pattabhi Ram) గుండెపోటు (Heart Attack)తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. వ్యక్తిత్వ వికాసంపై ఆయన రాసిన పుస్తకాలెన్నో ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాదు.. ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లోనూ రచనలు చేశారు. 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్థికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవిత చరిత్రల గురించి వ్యాసాలు రాశారాయన.
ఆయన మృతిపట్ల ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెజీషియన్‌గా, హిప్నాటిస్టుగా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా బీవీ పట్టాభిరామ్ ఎనలేని సేవలు అందించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
బి.వి.పట్టాభిరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేసారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికానుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న అతను ఒత్తిడిని జయించడం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించారు.
హిప్నోసిస్ పై ఇతను చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఇతనికి గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు ఇతనికి గౌరవ పౌరసత్వంకూడా ప్రధానం చేశారు. స్వయంగా ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటరును నెలకొల్పి నిర్వహిస్తున్నారు. అతను తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట, జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, డాక్టరు మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ (IOA), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, మచిలీపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ (NIRD), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (CIRE), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డిఆర్ డి ఎల్, డెల్, డెలాయిట్, ఇంకా రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్, మహీంద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజి, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నారు.






