- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh: ‘చర్చకు రెడీ.. ’ అంటూ వైసీపీకి సవాల్
వైసీపీ సభ్యుల ధర్నాపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు......

దిశ, వెబ్ డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు వైసీపీ సభ్యులే ధర్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. గత ప్రభుత్వ బకాయిలపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఫీజు పోరు అని పేరు పెట్టి.. యువత పోరుగా పేరు మార్చడం వింతంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏ విషయంపై పోరాడుతున్నారో వైసీపీ వాళ్లకే స్పష్టత లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు.
‘‘కరెంట్ ఛార్జీలు వారే పెంచి వారే ధర్నా చేస్తారు. ఎందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టారో సమాధానం చెప్పాలి. దీనిపై చర్చకు సిద్ధం. స్వల్పకాలిక చర్చ కూడా ఉంది. అన్ని అంశాలు చర్చిద్దాం. వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దాం.’’ అని లోకేశ్ తెలిపారు.






