రంజాన్ మాసం ఆరంభం.. ముస్లింల‌కు లోకేశ్ శుభాకాంక్షలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-01 14:16:40  IST  )

రంజాన్ నెల ప్రారంభం కావడంతో ముస్లిం సోద‌ర‌సోద‌రీమ‌ణులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు...

రంజాన్ మాసం ఆరంభం.. ముస్లింల‌కు లోకేశ్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: నెల వంక క‌నిపించడంతో ప‌విత్ర రంజాన్ మాసం(Ramadan Month) ఆరంభ‌మైంది. ఈ మేరకు రంజాన్ చాంద్ ముబారక్(Ramzan Chand Mubarak) అంటూ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్వాగతం పలికారు. రాష్ట్ర ముస్లిం సోద‌ర‌సోద‌రీమ‌ణులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. నెలంతా ఉప‌వాసాలు, ప‌విత్ర ఖురాన్ ప‌ఠ‌నం, త‌రావీ న‌మాజ్ భ‌క్తి శ్రద్ధల‌తో ప్రార్ధనలు చేస్తారని పేర్కొన్నారు. అల్లా ద‌య‌తో క్రమ‌శిక్షణ, శాంతి, స‌హ‌నం, దాన గుణంతో కఠోర ఉప‌వాస దీక్షలు సాగాల‌ని తను దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేశ్ తెలిపారు.

కాగా రంజాన్ మాసం ఖురాన్ అవరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మినిష్ట, పాపభీతి, పరామర్శించండం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవసేవ, దైవమార్గంలో స్థిరంగా ఉండటం, ఐక్యత, ఉత్సహం అల్లాహ్, మహాప్రవక్త(సగ)గారితో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే మాసం. ఈ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు విధిగా చేస్తారు.

అయితే నిన్న శుక్రవారం నెలవంక(చండ్రుడు) కనిపిస్తాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. తాజాగా నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్‌ ఉపవాస దీక్షలు రేపటి నుంచి ప్రారంభించనున్నారు.

Next Story