తెలంగాణకు హైదరాబాద్.. ఏపీకి చంద్రబాబు: నారా లోకేశ్

by Vemula.Srinu Prasad |

కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు ఉన్నారని మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

తెలంగాణకు హైదరాబాద్.. ఏపీకి చంద్రబాబు:  నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh, )కు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఉన్నారని మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి గొప్ప అడ్వాంటేజ్ అని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు అనుభవం, దూరదృష్టి ప్రధానమని చెప్పారు. అమరావతి, ఐటీ, విదేశీ పెట్టుబడులు చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి చాలా లాభం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం టెక్నాలజీ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో విశేష పురోగతి సాధించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.

Next Story