- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi:మంత్రి నారా లోకేష్ బర్త్ డే.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
నేడు ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా(Social Media) వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Wishes) వెల్లువెత్తుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: నేడు ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా(Social Media) వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Wishes) వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కూటమి నేతలు, టీడీపీ కార్యకర్తలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ‘‘ప్రియమైన లోకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని చిరు ట్వీట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కొందరి ప్రముఖులకు మాత్రమే శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలున్నాయని.. తొలిసారి మంత్రి లోకేష్‌కు విషెస్ చెప్పారని అంటున్నారు. దీని వెనుక ఏమైనా ఉందా అంటూ సామాజిక మాధ్యమాల్లో(Social Media) చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.






