- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే ఇంటర్ ఫలితాలు..మంత్రి నారా లోకేష్ ప్రకటన
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ ఇంటర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చని సూచించారు నారా లోకేష్. వాట్సాప్ (9552300009) ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు.
ఫలితాల విడుదల ఆలస్యం..కారణం ఇదే
ఏపీ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు నిర్వహించింది సర్కార్. అయితే ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెలరోజుల సమయం పట్టింది. ఈ కారణంగానే మూల్యాంకనం పూర్తి చేసేందుకు అధికారులు కాస్త సమయం తీసుకున్నారు. ఇక రేపు పరీక్షా ఫలితాలను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ అధికారిక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.






