BREAKING: కాశీబుగ్గ బాధితులకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి లోకేశ్‌

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-01 16:11:08  IST  )

కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించినవారి కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

BREAKING: కాశీబుగ్గ బాధితులకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి లోకేశ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి నారా లోకేష్.. సాయంత్రం మంత్రి అనిత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అలాగే క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందిస్తామని ప్రకటించారు.

94 ఏళ్ల వృద్ధుడు తన సొంత డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మించారని, ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయారని మంత్రి పేర్కొన్నారు. రద్దీని నియంత్రించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయిందన్నారు. ప్రస్తుతం పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి ప్రాణాపాయం లేదని, వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించామని తెలిపారు.

Next Story