‘బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారు’.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-01 07:42:22  IST  )

రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్(PDS) బియ్యం అక్రమ రవాణా(Rice smuggling) వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి(Civil Supplies Minister) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారు’.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్(PDS) బియ్యం అక్రమ రవాణా(Rice smuggling) వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి(Civil Supplies Minister) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు(ఆదివారం) మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బియ్యం డోర్ డెలివరీ అంటూ.. కొత్త పథకం మొదలు పెట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారని ఆయన విమర్శించారు. కాకినాడ పోర్టు(Kakinada Port)ను స్మగ్లింగ్ డెన్‌గా గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆయన ఆరోపించారు. కోటి 60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టును బియ్యం ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ బియ్యం విలువ రూ.45 వేల కోట్లు ఉంటుంది.

మాజీ సీఎం జగన్‌కు తెలియకుండా ఇది జరగదని మంత్రి నాదెండ్ల తెలిపారు. కాకినాడ పోర్టు(Kakinada Port)లో గత ప్రభుత్వ హయాంలో కేవలం 20 మంది పోలీసులను మాత్రమే పెట్టారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కాకినాడ పోర్టు పర్యటనతో స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎందుకు జీఎంఆర్ నుంచి ఎస్ఈఆర్‌ను లాగేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాకినాడ పోర్టు పై తాము ఎందుకు దృష్టి పెట్టామో ప్రజలకు తెలియాలని నాదెండ్ల అన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించెదవరో అందరికీ తెలియాలన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ చేసే వారందరి పేర్లు బయటకు తీసుకువస్తామని నాదెండ్ల తెలిపారు.

Next Story