- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ జిల్లాలో అద్భుతమైన వనరులు ఉన్నాయి’.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) మంత్రి నాదెండ్ల ఏలూరు కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల(Minister Nadendla Manohar) మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుందని తెలిపారు. ఈ క్రమంలో పోలవరం, కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశముందన్నారు. జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో అద్భుతమైన వనరులు ఉన్నాయని మౌలిక వసతుల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ఆర్ అండ్ బీ శాఖ నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. గత వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో రాష్ట్రం(Andhra Pradesh) అప్పులపాలైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే పలు హామీలను ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.






