రేషన్‌కార్డు తొలగించారంటూ వృద్ధురాలి ఆవేదన.. స్పందించిన మంత్రి నాదెండ్ల

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లోని వైఎస్ఆర్ కడప జిల్లా(YSR Kadapa District) చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె గ్రామానికి చెందిన పైడికాలువ భాగ్యమ్మ(60) అనే ఒంటరి మహిళ తన రేషన్ కార్డు(Ration Card) తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది

రేషన్‌కార్డు తొలగించారంటూ వృద్ధురాలి ఆవేదన.. స్పందించిన మంత్రి నాదెండ్ల
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని వైఎస్ఆర్ కడప జిల్లా(YSR Kadapa District) చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె గ్రామానికి చెందిన పైడికాలువ భాగ్యమ్మ(60) అనే ఒంటరి మహిళ తన రేషన్ కార్డు(Ration Card) తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు పెన్షన్(Pension) కూడా రావట్లేదని తెలిపింది. ఈ విషయం గురించి సమాచారం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister nadendla Manohar) వెంటనే స్పందించారు. ఈక్రమంలో పౌర సరఫరాల కమిషనర్‌కు దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ ఘటన పై సంబంధిత అధికారులు తెలిపిన నివేదిక ప్రకారం.. పైడికాలువ భాగ్యమ్మ రేషన్ కార్డు నెంబర్ YAP112701700491(రైస్ కార్డు నం.2807119008) epds ఆన్లైన్ వ్యవస్థలో పరిశీలించమని అన్నారు. ఆమె జనవరి 2025 వరకు రేషన్ కార్డు లబ్ది పొందినట్లు నమోదు కావడం జరిగింది. దీంతో కార్డు యాక్టివ్‌గానే ఉన్నట్లు నిర్ధారణైంది. అయితే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ సేవలు పునరుద్ధరణ అయిన వెంటనే ఆమెకు అవసరమైన రేషన్ కార్డు మంజూరు చేయబడుతుందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

Next Story