- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల.. కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఏలూరులో CRR కాలేజీలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

దిశ,వెబ్డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఏలూరులో CRR కాలేజీలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.131.82 కోట్ల చెక్కును మంత్రి డ్వాక్రా సంఘాల మహిళలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు,
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజెంట్ జనరేషన్లో పెరుగుతున్న టెక్నాలజీ(Technology) దృష్ట్యా మహిళలు అన్ని రంగాల్లో శిక్షణ పొందాలని తెలిపారు. ఈ క్రమంలో మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. అలాగే మహిళలు అత్యవసర పరిస్థితిలో ‘181 టోల్ ఫ్రీ’ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ‘మహిళల భద్రతకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని.. మీ వెంటే మేముంటాం’ అని మంత్రి నాదెండ్ల భరోసా ఇచ్చారు.
రాష్ట్రం(Andhra Pradesh)లో 96.40 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్(Free GAS) అందిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లుకు పూర్తిగా మద్దతిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Read Also..






