- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త రేషన్ కార్డుల మీద నేతలు ఫొటోలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం ఎదురుచూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం ఎదురుచూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) శుభవార్త చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. QR కోడ్‌లతో డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఆగష్టు 25వ తేదీ నుంచి అర్హులు అందరికీ పంపిణీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. తాజాగా మంజూరు చేయబోయే రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండబోవు అని స్పష్టం చేశారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని అన్నారు. ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింట్ చేయడం కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం కార్డుల్ని ముద్రిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి.. కొత్త కార్డుల కోసం మే నెలలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.






