- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ నాలుగు మెట్లు కిందకి దిగారు.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలని వైసీపీ(YCP) కుట్ర చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలని వైసీపీ(YCP) కుట్ర చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య వైసీపీ చిచ్చుపెడుతోందని మండిపడ్డారు. తాము ఎక్కడా ఉపేక్షించడం లేదని.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం(NDA Govt) కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కల్యాణ్(Pawan Kalyan) నాలుగు మెట్లు కిందకి దిగారని అన్నారు. కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వంపై తప్పుదు ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కల్యాణ్‌ది అని అన్నారు. ఒక జనసేన కమిట్మెంట్‌తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్(Jagan) అవలంభిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోరని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు. పచ్చటి కోనసీమలో ఘర్షణ వాతావరణం వద్దని పవన్ ధైర్యంగా నిలబడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తిస్తుందని చెప్పారు. వైసీపీ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలని కూటమి నేతలకు సూచించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. దీని వెనుక కుట్ర ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.






