- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మానవత్వం చాటుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మానవత్వం చాటుకున్నారు. ఈ రోజు(ఆదివారం) మంత్రి నాదెండ్ల విజయవాడ(Vijayawada) నుంచి గుంటూరు(Guntur) వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు దెబ్బ తగిలింది. రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగినట్లు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల వెంటనే తన వాహనం అక్కడే నిలిపి వేసి ఘటన స్థలం వద్దకు వెళ్లారు. సిబ్బంది సాయంతో ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేశారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం కాకుండా ఆపారు.
108కి ఫోన్ చేసి అంబులెన్స్(Ambulance) రప్పించి, అతడిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అతనికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి మంత్రి నాదెండ్ల సూచించారు. ఆ యువకుడిని విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చుతున్నట్లు 108 సిబ్బంది సమాచారం అందించారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మంత్రి నాదెండ్ల రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని చూసి కారు ఆపడం, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉండడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






