- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ఈ రకం వరి సాగు చేయొద్దు : మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి
రైతులు రెండురకాల వరిని సాగు చేయవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న ఆరు గ్యాస్ ఏజెన్సీలను ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. నాలుగు రోజుల్లో ఇంధన గ్యాస్ డెలివరీలు జరగాలని ఆదేశాలు జారీ చేశామని, బ్లాక్ మార్కెట్ పై నిఘా పెంచామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గ్యాస్ సిలిండర్లను అమ్మితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక ధాన్యం కొనుగోళ్లు, వరిసాగుపై మంత్రి రైతులకు కీలక సూచనలు చేశారు. రైతులు తమకు నచ్చిన మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఈ ఏడాది 61 శాతం అదనంగా ధాన్యం కొన్నామని తెలిపింది. అయితే.. రైతులు వచ్చే సీజన్లో వరి పీఆర్ 126, 1010 రకాలు సాగు చేయొద్దని, ఈ రెండు రకాల్లో 56 శాతానికి మించి నూకలు వస్తున్నట్లు తేలిందని తెలిపారు. సాధారణంగా ధాన్యంలో నూకల శాతం 25 శాతం లోపు ఉండాలని తెలిపారు. ఈ రకాల కొనుగోళ్ల వల్ల రైతులు, మిల్లర్ల మధ్య ఇబ్బందులొస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. ఖరీఫ్ లో 48,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.11550 కోట్లను రైతుల అకౌంట్లలో జమచేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.






