ముళ్ల కంచె వేసి పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు: మంత్రి నాదెండ్ల ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

అమరావతి రాజధానికి వ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వస్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారని మంత్రి నాదెండ్ల మానోహర్ గుర్తు చేశారు. ...

ముళ్ల కంచె వేసి పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు: మంత్రి నాదెండ్ల ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Janasena Chief Pawan Kalyan) వస్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారని మంత్రి నాదెండ్ల మానోహర్(Minister Nadendla Manohar) గుర్తు చేశారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన సంఘటనలపై మండిపడ్డారు. రైతులను పరామర్శింకుండా అడ్డుకుని ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అమరావతి అని తెలిపారు. విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, దాన్ని పూడ్చుకునేందుకు రైతులు చాలా త్యాగం చేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్ చేసిన అరాచకాలు ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రాగానే..

అధికారంలోకి రాగానే రాజ్యాంగ ప్రక్రియను మర్చిపోయిందని విమర్శించారు. వైఎస్ జగన్(Ys Jagan) నిర్ణయంపై వ్యతిరేక వచ్చి రైతులు దాదాపు 16,31 రోజులు పోరాటం చేశారన్నారు. ఇలాంటి పోరాటం స్వతంత్ర భారత చరిత్రలోనే జరగలేదని చెప్పారు. చంటి బిడ్డలను ఎత్తుకుని రాజధాని కోసం మహిళలు చేసిన పోరాటం మర్చిపోలేనిదని మంత్రి నాదెండ్ల తెలిపారు.

Next Story