పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం: మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-10 11:52:57  IST  )

పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు..

పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం: మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Jana Sena chief and Deputy CM Pawan Kalyan) వల్లే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన(Jansena) పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉందని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకు పవన్ కల్యాణ్ అండగా నిలిచారని తెలిపారు. కూటమిలో భాగంగా ఎన్నికల్లో తెలుగుదేశం(TeluguDesam) పార్టీకి ఓటు వేయాలని జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించారని చెప్పారు.


ఈ రోజు పొత్తు ఉందంటే పవన్ కల్యాణ్ వల్లేనని, జనసేన పార్టీ త్యాగం చేసిందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, ఏ రాజకీయ పార్టీలోనైనా ఉంటాయన్నారు. సమస్యలపై జాగ్రత్తగా సహనం, ఓపికతో పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ(Bjp) కూటమిగా రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పని చేస్తున్నామన్నారు. పదవులు రావొచ్చని.. రాకపోవచ్చని కానీ ప్రజలకు సేవ చేసే సువర్ణావకాశం వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Next Story