దిష్టి రాజకీయం..! పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్

by Ramesh Naini |

కోనసీమకు దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.

దిష్టి రాజకీయం..! పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోనసీమకు దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమవారం మీడియా అడిగిన పశ్నలకు ఆయన సమాదానం చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు. వక్రీకరించడం, అనవసరంగా రాద్ధాంతం చేశారని అన్నారు. రైతులతో మాట్లాడిన సందర్భంలో మాత్రమే ఆయన అన్నారని, అంతే కానీ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయం చేయాల్సిన అంశం కాదన్నారు. పవన్ కల్యాణ్ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తెలంగాణ ప్రజలపై పవన్ కల్యాణ్ కు నమ్మకం, ప్రేమ ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయం చేయాల్సిన అంశం కాదని మరోసారి మంత్రి నాదెండ్ల మనోహర్ నొక్కి చెప్పారు.

కాగా, గత నెల 26 వ తేదీన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శంకరగుప్తం మెజర్ డ్రెయిన్ లోంచి వస్తున్న సముద్రపు జలాల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గోదావరి జలాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే. ఆ శాపం తగిలినట్టుంది. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని, తెలంగాణ నాయకులంతా అంటారు. నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణలో పలువురు నేతలు, మంత్రులు తీవ్రంగా ఖండించారు.

Next Story