కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ: జగన్‌పై మంత్రి నాదెండ్ల సెటైర్స్

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నాదెండ్ల సెటైర్స్ వేశారు...

కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ: జగన్‌పై మంత్రి నాదెండ్ల సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(YS Jagan) మతిస్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలను జనసేన(Janasena) పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) అన్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైనాట్ 175 కాస్త 11కి పడిపోయి ఆ అక్కసుతో మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని తామూ అనగలమని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉండి ఒక్క రూపాయి కూడా సాటివారికి ఖర్చు చేయని జగన్‌కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు శాసన సభ్యుడయ్యారని సెటైర్లు వేశారు.

ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసమైనా శాసన సభకు వచ్చి మాట్లాడాలి కదా?’ అని మంత్రి నిలదీశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. జగన్‌లా బటన్లు నొక్కామని మోసం చేయదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రభుత్వంలో ఒకలా ప్రవర్తించే వ్యక్తి కాదన్నారు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుంటే వారి కుటుంబాలను ఆదుకునేందుకు స్వయంగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి ఒక్కొ కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించారని గుర్తు చేశారు. చివరికి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రాంతానికి చెందిన 24 మంది రైతులకు కూడా పవన్ కల్యాణ్ అండగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Next Story