క్షమాపణలు చెప్పాలిందే: మంత్రి నాదెండ్ల డిమాండ్

by Vemula.Srinu Prasad |

తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు....

క్షమాపణలు చెప్పాలిందే: మంత్రి నాదెండ్ల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం(Tirumala laddu issue)లో వైసీపీ(Ycp) నేతలు తప్పు చేశారని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్(Minsiter Nadendla Manohar) డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని సిట్ చెబితే తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని, తిరుమల లడ్డూపై మాట్లాడే హక్కు వైసీపీ వాళ్లకు లేదని ఆయన మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీకి కారణమైన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

ఎన్వీఆర్ కాలనీలో..

కాగా తెనాలి నందులపేట ఎన్వీఆర్ కాలనీలో గోధుమ పిండి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మనోహర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అహార పధార్థాలు అందజేస్తామన్నారు. పోషక విలువ పెంచే బియ్యం, చక్కెర, జొన్నలు పంపిణీ చేశామని, ఇక నుంచి రూ. 20కే నాణ్యమైన గోధుమ పిండిని అందజేస్తున్నామని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

Next Story