- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister: ఎవరికీ అనుమానం అవసరం లేదు.. మనదే విజయం
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమిదే విజయం అని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ధీమా వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమిదే విజయం అని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. వైసీపీ అధినేతవి దుర్మార్గమైన ఆలోచనలు అని విమర్శించారు. ప్రజల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నేత బెంగళూరు నుంచి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్నదాతల కడుపు నింపే పంటను రోడ్లుపై వేసి తొక్కించే మనస్తత్వం ఆయనదని మండిపడ్డారు. హెలికాప్టర్ లోవచ్చి హడావుడి తప్ప... రైతులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రైల్వేకోడూరు మార్కెట్ యార్డు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Next Story






