- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో మంత్రి నాదెండ్ల.. కేంద్ర పెద్దలతో వరుస భేటీలు
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు చురుగ్గా కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట్రంలో పౌర సరఫరాల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఆయన పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్, సంయుక్త కార్యదర్శి సుజాత శర్మలతో మంత్రి నాదెండ్ల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు, సరఫరా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడంపై లోతుగా చర్చించారు.
ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యం...
అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మంత్రి నాదెండ్ల మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు, సరుకులు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారంపై సానుకూల స్పందన లభించినట్లు సమాచారం.






