ఢిల్లీలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ.. ఏపీ రేషన్ షాపు సిబ్బందిపై ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-09 09:05:31  IST  )

ఢిల్లీ ఏపీ భవన్ రేషన్ షాపులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు చేశారు...

ఢిల్లీలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ.. ఏపీ రేషన్ షాపు సిబ్బందిపై ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ(Delhi)లోని ఏపీ భవన్‌(AP Bhavan)లోని పౌర సరఫరాల దుకాణం(Civil Supplies Store)లో సోదాలు చేశారు. బియ్యం నాణ్యత(Rice Quality)ను పరిశీలించారు. బియ్యం బస్తాలను చెక్ చేశారు. బస్తాలను వెయింగ్ చేయించారు. దీంతో బస్తాల్లో తేడాలు గమనించారు. 26 కేజీలుండాల్సిన బస్తాలు.. 25 కేజీలు ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ దుకాణాన్ని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్స్ సప్లై కార్పొరేషన్ ద్వారా బియ్యమే కాదు కొన్ని సరుకులు కూడా అందించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో మంచి సేవ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఇక్కడ బియ్యం మాత్రమే నిల్వ చేస్తున్నారు. వెయింగ్ మిషన్ కూడా సరిగా పని చేయడంలేదన్నారు. బియ్యం తూకంలో తేడాలున్నాయన్నారు. ఈ దుకాణాన్ని వెంటనే సీజ్ చేస్తున్నామని చెప్పారు. సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు.

Next Story