- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nadendla Manohar:గిరిజనులతో చిందులేసిన మంత్రి నాదెండ్ల
ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఏలూరు జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల(Minister Nadendla Manohar) మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన 35 వేల మంది నిర్వాసితులు త్యాగాలను తమ ప్రభుత్వం మరిచిపోదు అని తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు ఆహార భద్రతాకీ అంత్యోదయ అన్నా యోజన కార్డులు అందజేసి వారికి ప్రతినెలా 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు.
ఈ క్రమంలో ఏలూరు జిల్లా(Eluru District) బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు. అనంతరం బర్రింకలపాడులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(Chirri Balaraju) క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్లకు స్థానిక గిరిజన ప్రజలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, సంగీతాలతో స్వాగతం పలికారు. ఈ తరుణంలో మంత్రి వారి వద్ద ఉన్న కొమ్ములు ధరించారు. ఈ క్రమంలో గిరిజనులతో కలిసి మంత్రి నాదెండ్ల నృత్యం చేశారు.






