- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిహరవీరమల్లును ఎక్కువసార్లు చూడండి..ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మంత్రి రిక్వెస్ట్
హరిహరవీరమల్లు సినిమా చూసి పవన్ కల్యణ్ క్రేజ్ తగ్గకుండా చూడాలంటూ జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హరిహరవీరమల్లు సినిమా చూసి పవన్ కల్యణ్ క్రేజ్ తగ్గకుండా చూడాలంటూ జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలని కోరారు. డబ్బులు పెట్టి లేనివారికి సినిమా చూపించాలని సైతం మంత్రి రిక్వెస్ట్ చేశారు.
వారం రోజుల పాటు సినిమాకు సపోర్ట్ చేయాలని, నెగిటివ్ టాక్ ఉందని, దాన్ని మార్చాలని అన్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలని చెప్పారు. హరిహరవీరమల్లు ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, గ్రామ, మండల జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలన్నారు. ప్రతి థియేటర్ కు వెళ్లి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఆరా తీయాలని, అందరినీ సినిమాకు తీసుకువచ్చే బాధ్యత మీదేనని నాదెండ్ల వ్యాఖ్యానించారు.






