- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP:సింహాచలం ఘటన.. బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి నాదెండ్ల, హోం మంత్రి అనిత
సింహాచలంలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.

దిశ,వెబ్‌డెస్క్: సింహాచలంలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా ఆలయ క్షేత్రం ఆవరణలో గోడ కూలింది. ఈ క్రమంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) గాయపడిన వారి కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar), హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha), పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం మృతి చెందిన ఏడుగురులో ఇద్దరు జనసేన(Janasena) క్రియాశీలక కార్యకర్తలు ఉండడం పార్టీకి, వారి కుటుంబాలకు తీవ్ర లోటు అని మంత్రి నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి నాదెండ్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అండగా ఉంటారని మంత్రి నాదెండ్ల భరోసా ఇచ్చారు.






