లడ్డూ కల్తీపై మేము చెప్పిందే నిజమైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

తిరుమల లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు...

లడ్డూ కల్తీపై మేము చెప్పిందే నిజమైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ(Tirumala laddu adulteration)పై తాము చెప్పిందే నిజమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) అన్నారు. కల్తీ లడ్డూ కేసు నేపథ్యంలో సీబీఐ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోని SIT దర్యాప్తుతో కల్తీ నెయ్యితోనే శ్రీవారి లడ్డూలు, ప్రసాదాలు తయారీ అని బట్టబయలు చేసిందన్నారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారీ చేయడం మహాపాపమని చెప్పారు. తప్పు చేయలేదని చెప్పేవారు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగారని రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ నిబంధనలను నీరుగార్చి ఇష్టానుసారంగా కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. తిరుమల(Tirumala)ను వైసీపీ(Ycp) అక్రమాల, పాపల పుట్టగా మార్చిందని విమర్శించారు. ఇప్పటికైనా మించినది ఏమి లేదు, కల్తీ చేసిన వారు స్వామివారిని క్షమాపణ కోరాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హితవు పలికారు.

Next Story