- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్ న్యూస్... ఖరీఫ్ సీజన్‌పై మంత్రి కీలక ప్రకటన
ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి మన రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖను పూర్తి స్థాయిలో సమాయత్తం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: ఖరీఫ్-2026 సీజన్(Kharif 2026 Season)కు సంబంధించి మన రైతు(Farmers) సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖను పూర్తి స్థాయిలో సమాయత్తం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. ఖరీఫ్ సన్నద్ధతపై అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు పండించే ప్రతి గింజా ముఖ్యమని, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల(Seeds and fertilizers) కొరత అనే మాట రాకూడదని చెప్పారు. జిల్లాల్లో ఉన్న వాస్తవ నిల్వలపై అధికారుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఎరువుల దుర్వినియోగానికి పాల్పడినా, అక్రమ రవాణా చేసినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ షాపుల వద్ద రైతులు గందరగోళానికి గురికాకుండా, ప్రతి రైతుకు అవసరమైన మేరకే యూరియా అందేలా ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయబోతున్నామన్నారు. రైతులు ముందస్తుగా యూరియాను నిల్వ చేసుకోవద్దని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
పరిస్థితుల దృష్ట్యా...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా యూరియా దిగుమతుల్లో ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అయితే రైతులు కూడా సాంప్రదాయ పద్ధతుల నుండి సుస్థిర, సహజ వ్యవసాయం వైపు మారాలని ఆయన చెప్పారు. మొదటి దశలో సాధారణ యూరియా వాడినా, తదుపరి దశల్లో నానో యూరియా వినియోగించి అద్భుత ఫలితాలు సాధించాలని కోరారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఎల్‌నినో పరిస్థితులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వీలైనంత వరకు ప్రత్యక్ష విత్తన సాగు, అంతర పంటలను ప్రోత్సహించేలా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.






