‘పవన్ కళ్యాణ్ సవాల్‌ను స్వీకరిస్తున్నా’.. మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-10 09:09:05  IST  )

పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు.

‘పవన్ కళ్యాణ్ సవాల్‌ను స్వీకరిస్తున్నా’.. మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించిన ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-2.0’ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో రాజకీయాలు వద్దు.. ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టాలన్నది మా విధానం. గతంలో మాదిరి పార్టీ రంగులు, మా ఫోటోలు విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాలు, వస్తువులపై ఎక్కడా కనిపించవు. పాఠశాలలో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఏ ఇతర కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఒకే రోజు మెగా పీటీఎం నిర్వహించడం ఒక రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు.

2.30 కోట్ల మంది పాల్గొనే అతి పెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్‌గా రికార్డ్ సృష్టించబోతోంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను అనుసంధానం చేయడమే ఈ మెగా పీటీఎం లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. ఈ క్రమంలో నాకు అన్నతో సమానమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. స్కూల్ పిల్లలేే మొక్కలు నాటుతారని తెలిపారు. అందుకే విద్యార్థులకు గ్రీన్ పాస్‌బుక్ ఇచ్చామని అన్నారు. ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా? అని విద్యార్థులు పరిశీలిస్తారు. 3 సంవత్సరాలైన తర్వాత హెడ్‌మాస్టర్ ఆ గ్రీన్ బుక్ పై సంతకం చేస్తారు. మొక్కలు పెంచడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యత పెరుగుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Next Story