‘ఏ అంశంపై పోరాడుతున్నారో వారికే స్పష్టత లేదు’.. మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఇవాళ(మార్చి 12) వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

‘ఏ అంశంపై పోరాడుతున్నారో వారికే స్పష్టత లేదు’.. మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇవాళ(మార్చి 12) వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు వారే ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు.

దీనిపై మంత్రి లోకేష్(Minister Nara Lokesh) స్పందిస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ‘ఫీజు పోరు’ అని పేరు పెట్టి.. ‘యువత పోరు’గా పేరు మార్చడం వింతగా ఉందన్నారు. బయట నవ్వుకుంటున్నారని.. ఏ విషయం పై పోరాడుతున్నారో వైసీపీకి స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వారే పెట్టి.. వారే ధర్నాలు చేయడం చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తోందన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4,271 కోట్లు, కరెంట్ చార్జీలు వారే పెంచి వారే ధర్నా చేస్తున్నారు అని అన్నారు. ఎందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టారో సమాధానం చెప్పాలని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. దీనిపై స్వల్పకాలిక చర్చ కూడా ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దామన్నారు.. దీంతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగడంతో మండలి ఛైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Next Story