Nara Lokesh:‘అలాగైతే రాజీనామా చేస్తా’.. మంత్రి లోకేష్ సంచలన సవాల్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-27 11:27:02  IST  )

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Nara Lokesh:‘అలాగైతే రాజీనామా చేస్తా’.. మంత్రి లోకేష్ సంచలన సవాల్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాజాగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తా అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సీఎం పదవికి అంత తొందరేముంది అన్నారు. జూన్‌ 12లోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. సరైన సమయంలో అందరికీ పదవులు వస్తాయి. మండల పార్టీ నుంచి జాతీయ స్థాయి వరకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) తెలిపారు. మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం అన్నారు.

మిషన్ రాయలసీమకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ఒక్క రోజు కూడా నిజాలు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

జగన్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి(Former CM YS jagan) మంత్రి నారా లోకేష్ సంచలన సవాల్ విసిరారు. ‘‘ఊర్సా క్లస్టర్స్‌కి 99 పైసలకి ఎకరా భూమి ఇచ్చినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే.. రాజీనామా చేస్తా. జగన్‌కు ఇదే నా సవాల్’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మార్కెట్ రేటు ప్రకారమే ఊర్సాకు భూములు ఇచ్చాం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

Next Story