‘మీకు 24 గంటల టైం ఇస్తున్నా’.. మంత్రి లోకేష్ సంచలన సవాల్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-14 14:33:13  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గురువారం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

‘మీకు 24 గంటల టైం ఇస్తున్నా’.. మంత్రి లోకేష్ సంచలన సవాల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గురువారం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల ఖాతాలో రూ.13వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పై వైసీపీ నేతలు ఆరోపించారు. రూ.15వేలు తల్లుల అకౌంట్‌లో జమచేయడం లేదని.. మిగిలిన రూ.2వేలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖాతాలో జమ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. దీనిపై మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు నా అకౌంట్‌లో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఈ తరుణంలో మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే.. నా ఖాతాలో డబ్బులు పడినట్లు నిరూపించండని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీపైన న్యాయపోరాటం చేస్తాం. మీ ఫేక్ ప్రచారం పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసత్య ఆరోపణలను గతంలో మాదిరి ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడిన వీడియోను తాజాగా టీడీపీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

Next Story