- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రతి శనివారం నో బ్యాగ్ డే’.. స్కూళ్లకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అడుగులు వేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విద్య వ్యవస్థ(Education System)లో నూతన టెక్నాలజీ(New technology)కి అనుకులంగా పలు మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రి లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్కూళ్లో(School) ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. బ్యాగ్ లేకుండానే ఆ రోజు స్కూల్ జరిగేలా కో కరిక్యులర్ యాక్టివిటీస్ (Co curricular activities) రూపొందించాలన్నారు.
టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ను రిలీజ్ చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. సాంకేతికత సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడీ అనుసంధానం పై ఆరా తీశారు. ఇంటర్మీడియట్(Inter) విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపై సమావేశంలో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జీవో 117 ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని మంత్రి లోకేష్ తెలిపారు. టీచర్ల బదిలీ చట్టం పైన అభిప్రాయాలు సేకరిస్తామని పేర్కొన్నారు.






