మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్

by Gantepaka Srikanth |

మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ రోజు ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్ చేయలని నిర్ణయించారు. ఈ డిన్నర్‌ మీట్‌లో ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిరోజు సాయంత్రం ఒక్కో జిల్లా ఎమ్మెల్యేలతో లోకేష్ భేటీ కానున్నారు. రేపు మచిలీపట్నం జిల్లా ఎమ్మెల్యేలతో డిన్నర్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మూలంగా ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే అవకాశం రావడంతో పాటు నియోజకవర్గ సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంటుందని మంత్రి లోకేష్ భావిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. సభాపతి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు 17 పనిదినాల పాటు కొనసాగనున్నాయి. ఈనెల 14న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నారు. మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు. 18న బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి సమాధానమివ్వనున్నారు.

Next Story