- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
ఏపీ(Andhra Pradesh) శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు(బుధవారం) సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మాట్లాడుతూ.. ఏపీలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ రెండవ సవరణ బిల్లు-2025 ను మంత్రి లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిని సభ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగిందని మంత్రి లోకేష్ వెల్లడించారు.
సాంకేతిక అంశాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. గ్రీన్ ఫీల్డ్ గురించి ఇప్పటికే చర్చించాం. బ్రౌన్ ఫీల్డ్ కింద ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తించాలని కోరుకున్నప్పుడు.. కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం వీవీఐటీ ప్రైవేటు యూనివర్సిటీ గా గుర్తించాలని కోరడం జరిగింది. వారికి 50 ఎకరాల భూమి ఉంది. 4,75,278 చ.అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేటర్ సెంటర్స్ ఉన్నాయి. 11 యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. సుమారు 700 మంది సిబ్బంది ఉన్నారు. 9,200 మంది విద్యార్థులు ఉన్నారు.
ఈ సొసైటీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. VVITని VVITUగా మార్చాలని కోరారు. అది కూడా 2016 యాక్ట్ కింద కన్వర్ట్ చేయాలని కోరారు. ఈ యాక్ట్ గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ, మరొకటి బ్రౌన్ ఫీల్డ్.. అంటే కన్వర్షన్. వీవీఐటీ కన్వెర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ గా గుర్తించాలని కోరడం జరిగింది. యూనివర్సిటీ ఎప్పుడు వచ్చినా చట్టసభల్లో యాక్ట్ కింద సవరణ చేసి యూనివర్సిటీ పేరును ఇంక్లూడ్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.






