- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ భాష పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) ఇటీవల హిందీ(Hindi) భాష పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) ఇటీవల హిందీ(Hindi) భాష పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ విద్యా,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) హిందీ భాష పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. హిందీని జాతీయ భాషగా పేర్కొన్నారు. అయితే యాంకర్ హిందీ జాతీయ భాష కాదు అని చెప్పగా.. మనం హిందీ ఎందుకు నేర్చుకోకూడదు? జాతీయ భాషగా హిందీని ఎందుకు ముందుకు తీసుకెళ్లకూడదు? అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇంగ్లీష్ లాగే హిందీ కూడా లింక్ లాంగ్వేజ్ అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హిందీ భాష పెద్దమ్మ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ హిందీ భాష పై చేసిన వ్యాఖ్యల పై సామాజిక మాధ్యమా(Social Media)ల్లో చర్చనీయాంశంగా మారింది.






