- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రశాంత్ కిషోర్‌ని కలవడంపై మంత్రి లోకేష్ వివరణ

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో భాగంగా ప్రశాంత్ కిషోర్‌ను కలవడంపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఢిల్లీ పర్యటన ఫలప్రదమైందని అన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కాలేదని అన్నారు. ప్రస్తుతం రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హిందూ ఆలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదని కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెబితే సరిపోదు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు రాష్ట్రంలో పిల్లలు CBSE సిలబస్‌కు సిద్ధంగా లేరు.. అందుకే విడతలవారీగా సిలబస్ అమలు చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్(Prashant Kishore)ని కలవడంలో ప్రత్యేకం ఏమీలేదు. తాను అన్ని వర్గాలను కలుస్తానని.. ఆయన్ను కూడా నార్మల్‌గానే కలిశానని అన్నారు.
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందన..
ఢిల్లీలో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయని రాకా లోకేష్ అన్నారు. ఢిల్లీలో హాఫ్ ఇంజిన్ ప్రభుత్వం వద్దని.. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ మరింత బలోపేతం అవుతోందని చెప్పారు. జగన్ కుటుంబం(Jagan Family)లో ఎవరికీ భద్రత తగ్గించలేదు. నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నామని అన్నారు. వైసీపీ 1.O నే ఇంకా మర్చిపోలేకపోతున్నారు.. ఇక 2.O ఎక్కడ నుంచి వస్తుందని సెటైర్ వేశారు.